వల్లూరులో సూర్యోదయం మునుపే NTR భరోసా పెన్షన్ పంపిణీ

April 2, 2026 12:13 PM

కడప జిల్లా వల్లూరు మండలంలో అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను సూర్యోదయం మునుపే ఇంటి వద్దకు చేరవేసి పంపిణీ చేశారు. ప్రతి నెలా సమయానికి పెన్షన్ అందిస్తూ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందుతోందని స్థానిక నాయకులు తెలిపారు.

మండల టిడిపి అధ్యక్షుడు లేబాక నాగేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రజల క్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం నేరుగా చేరేలా చర్యలు తీసుకుంటున్నామని, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమాన్ని సమాంతరంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media