సూర్య నటించిన ‘కరుప్పు’ (వీరభద్రుడు) సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆర్థికపరమైన అడ్డంకుల కారణంగా గురువారం నిలిచిపోయిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. “కరుప్పు కోసం ఎదురుచూసిన ప్రతి ఒక్కరికీ, మాపై నమ్మకం ఉంచిన అభిమానులకు క్షమాపణలు, కృతజ్ఞతలు. ఈ నిరీక్షణ మీకు బాధ కలిగించిందని మాకు తెలుసు. మీ ప్రేమ, మద్దతే మా కలను సజీవంగా ఉంచాయి. ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, నిద్రలేని రాత్రుల ఫలమైన ఈ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది” అని చిత్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పేర్కొంది.
గురువారం విడుదల కావాల్సిన ఈ సినిమా ఆర్థిక సమస్యల వల్ల ఆగిపోవడంతో పలు ప్రాంతాల్లో షోలు రద్దయ్యాయి. దీంతో దర్శకుడు ఆర్జే బాలాజీ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేస్తూ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. సినిమా విడుదల ఆలస్యమైనందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు.
