భారత క్రికెట్ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్, దేశవాళీ క్రికెట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 15 ఏళ్ల తన సుదీర్ఘ దేశవాళీ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు శుక్రవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. క్రికెట్టే నా జీవితం.. 10 ఏళ్ల వయసులో ఆడటం ప్రారంభించి, 25 ఏళ్ల తర్వాత అన్ని స్థాయిల్లో ఆడే అవకాశం దక్కినందుకు కృతజ్ఞుడినన్నారు. ఇప్పుడు కొత్త అవకాశాల కోసం దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నానని తన ప్రకటనలో తెలిపాడు డు.
35 ఏళ్ల విజయ్ శంకర్ 2012లో తమిళనాడు తరఫున తన కెరీర్ ప్రారంభించి, చివరిగా 2025-26 సీజన్‌లో త్రిపుర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరఫున 12 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడిన విజయ్ శంకర్, 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌పై తాను వేసిన మొదటి బంతికే వికెట్ తీసి అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ వంటి ఫ్రాంచైజీలకు ఆడాడు. 2026 వేలంలో విజయ్ శంకర్ అమ్ముడుపోలేదు.

