నగరంలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS)లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడీసీపీ (ADCP) ఎం. రాజారావు పాల్గొని కేక్ కట్ చేసి, సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏడీసీపీ రాజారావు మాట్లాడుతూ.. యేసుక్రీస్తు తన బోధనల ద్వారా లోకానికి శాంతి, పరివర్తన సందేశాన్ని అందించారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ అహంకారాన్ని వీడి, త్యాగనిరతితో మంచి మార్గాన్ని ఎంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జీవిత ప్రయాణంలో క్రీస్తు చూపిన ప్రేమ, కరుణ అనే మార్గంలో నడవాలని సూచించారు.
ఈ వేడుకల్లో సీసీఎస్ విభాగపు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని క్రిస్మస్ గీతాలను ఆలపిస్తూ సందడి చేశారు.
