Vijayawadaలో కాల్పుల కలకలం రేగింది. బస్ స్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్ వద్ద పోలీసులు, ఈగల్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి గన్‌తో కాల్పులకు ప్రయత్నించాడు. అయితే ట్రిగ్గర్ నొక్కినా బులెట్ ఛాంబర్లోకి రాకపోవడంతో కాల్పులు జరగలేదని పోలీసులు గుర్తించారు.
ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. అతను Nellikuduruకు చెందినవాడిగా గుర్తించారు. అతడి వద్ద నుంచి 9 ఎమ్ఎమ్ పిస్టల్‌తో పాటు ఐదు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు.

