వికారాబాద్‌లో 17 ప్రైవేట్ బస్సులు నిలిపివేత – డ్రైవర్‌పై చర్యలు

March 23, 2026 4:24 PM

వికారాబాద్ ఆర్టీసీ డీపో పరిధిలో నడిచే 17 ప్రైవేట్ బస్సులను యాజమాన్యం తాత్కాలికంగా నిలిపివేయడం కలకలం రేపింది. డ్రైవర్ సురేష్‌పై తీసుకున్న చర్యలకు నిరసనగా ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఆర్టీసీ మేనేజర్ నమ్రత తెలిపిన వివరాల ప్రకారం, డ్రైవర్ సురేష్‌పై పలుమార్లు ఫిర్యాదులు రావడంతో అతన్ని విధుల్లోకి తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అగ్రిమెంట్ నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడపకపోతే జరిమానాలు విధించాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.అయితే, సురేష్‌కు మద్దతుగా ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు బస్సులను నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం వరకు బస్సులు తిరిగి నడిపిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది.ఈ ఘటనతో ఆర్టీసీ-ప్రైవేట్ బస్సు యాజమాన్యాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media