విశాఖపట్నంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో అక్కయ్యపాలెం సచివాలయానికి చెందిన ఉద్యోగి పైలా రాజేష్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. లలితా నగర్ సచివాలయంలో వార్డు ఎడ్యుకేషన్ కం డేటా ప్రాసెసింగ్ సెక్రటరీగా పనిచేస్తున్న రాజేష్, స్థిరాస్తి సెటిల్‌మెంట్ డీడ్ ప్రాసెస్ కోసం రూ.90 వేల లంచం డిమాండ్ చేసి, రూ.80 వేల వద్ద ఒప్పందం కుదుర్చుకున్నాడు.
లంచం ఇవ్వడానికి నిరాకరించిన బాధితుడు గణేష్ ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు పన్నిన ఉచ్చులో రాజేష్ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచనున్నారు.ఈ ఆపరేషన్‌లో డీఎస్పీలు రమణమూర్తి, హర్షిత, సీఐలు శ్రీనివాస్, వెంకటరావు పాల్గొన్నారు. అవినీతి కేసులపై ఫిర్యాదుల కోసం 1064 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ఏసీబీ అధికారులు సూచించారు.
