విశాఖలో IFR2026 రాష్ట్రపతి, CM, Dy cm సమక్షంలో కనువిందు

February 18, 2026 5:37 PM

సాగర తీరంలో భారత నావికా దళం అద్భుత విన్యాసాలతో అదరగొట్టింది. విశాఖలో జరుగుతున్న ‘ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ’ (IFR) వేడుకల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన విన్యాసాలను గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారు తిలకించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ S. అబ్దుల్ నజీర్, CM నారా చంద్రబాబు నాయుడు, Dycm పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. సముద్ర గర్భంలో భారత సైనిక సంపత్తిని, నౌకాదళ శక్తిసామర్థ్యాలను చాటేలా సాగిన ఈ ప్రదర్శన ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media