AP:రూ. 8,650 కోట్లతో విశాఖ అంతర్జాతీయ టూరిజం హబ్‌

February 24, 2026 5:05 PM

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో విశాఖపట్నంను కీర్తి కిరీటంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. విశాఖను అంతర్జాతీయ స్థాయి ‘యాంకర్ హబ్’గా మార్చేందుకు రూ. 8,650 కోట్ల పెట్టుబడులతో 50 ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.

ఒబేరాయ్, తాజ్, మేఫెర్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. దీని ద్వారా అదనంగా 2,858 గదులు అందుబాటులోకి రానున్నాయి. విశాఖను మెయిన్ హబ్‌గా చేసి సింహాచలం, బౌద్ధారామాలు, బీచ్ మరియు ఎకో టూరిజం సర్క్యూట్‌లను అనుసంధానించనున్నారు. సీ-ప్లేన్, హెలీ టూరిజం, సీ-క్రూజ్ సర్క్యూట్ (విశాఖ-చెన్నై-కోల్‌కతా) మరియు క్యారవాన్ పార్కులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే 10 రకాల జలక్రీడలు ప్రారంభమయ్యాయి. ప్రసాద్ స్కీమ్ కింద సింహాచలానికి రూ. 54 కోట్లు, స్వదేశీ దర్శన్ ద్వారా బొర్రా గుహలకు రూ. 28 కోట్లు కేటాయించారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు 490 హోమ్ స్టేలను ఏర్పాటు చేస్తూ స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.సీఆర్ జెడ్ (CRZ) నిబంధనల సడలింపు కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలోనే బీచ్ రోడ్డు నిర్మాణాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media