భోగాపురం వరకు మెట్రో ప్రతిపాదన M.D రామకృష్ణారెడ్డితో గంటా

April 14, 2026 12:14 PM

భోగాపురం వరకు మెట్రో సేవలను పొడిగించి, రుషికొండ ఐటీ సెజ్‌కు అనుసంధానం చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు. మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి ఆయనను కలసి ప్రాజెక్టుపై చర్చించారు.

ప్రస్తుతం కొమ్మాది వరకు ప్రతిపాదించిన మెట్రో లైన్‌ను భోగాపురం వరకు విస్తరిస్తే ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులకు సౌలభ్యం కలుగుతుందని, ఆ ప్రాంత అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. రోడ్డు సౌకర్యంతో పాటు మెట్రో అందుబాటులో ఉంటే ప్రయాణికుల రాకపోకలు పెరుగుతాయని పేర్కొన్నారు.రుషికొండలో కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ వంటి ఐటీ సంస్థలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో మెట్రో కనెక్టివిటీ ఉద్యోగులకు మేలు చేస్తుందని అన్నారు.విశాఖలో నాలుగు కారిడార్ల కింద మొత్తం 76.90 కి.మీ మెట్రో ప్రణాళిక ఉన్నదని, మొదటి దశలో రూ.11,498 కోట్లతో 46.23 కి.మీ నిర్మాణం చేపడుతున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. భూసేకరణ కోసం రూ.882 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media