విశాఖ ఉక్కు కర్మాగారంలో గురువారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. ప్లాంట్‌లోని కోక్ ఓవెన్ విభాగంలో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించగా, సిబ్బంది అప్రమత్తతతో పెను ముప్పు తప్పింది.
స్టీల్ ప్లాంట్ బ్యాటరీ-1 (Battery-1) విభాగంలో జీసీఎం (GCM) గ్యాస్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.మంటలు వ్యాపిస్తుండటాన్ని గమనించిన కార్మికులు వెంటనే ఛార్జింగ్ కార్ (Charging Car) ఆపరేషన్‌ను నిలిపివేశారు. ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది మరియు ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి గ్యాస్ మంటలను వేగంగా అదుపులోకి తెచ్చారు.అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. సకాలంలో స్పందించడం వల్ల భారీ ఆస్తి నష్టం కూడా తప్పిందని అధికారులు తెలిపారు
