ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు విశాఖ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో స్వాధీనం చేసిన సుమారు 10,147 కేజీల గంజాయి, 19,310 లీటర్ల లిక్విడ్ గంజాయిను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో మారికవలస డంపింగ్ యార్డ్‌లో దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీ శంఖబ్రత బాగ్చి, ఈగల్ ఐజీ ఆర్.కే. రామకృష్ణ, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
డీజీపీ మాట్లాడుతూ, “గంజాయి అరికట్టడం యుద్ధం లాంటిది. దీనిని ప్రజల సహకారంతో ముందుకు తీసుకువెళ్తాం. గంజాయి వ్యాపారం చేసే వారిని టెర్రరిస్టులుగా చూస్తాం. ఇకపై కేసుల్లో నిందితుల ఆస్తులను కూడా జప్తు చేస్తున్నాం” అన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై కచ్చితమైన పర్యవేక్షణ ఉండాలని సూచించారు.సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ, ఇప్పటివరకు 1,435 మందిని అరెస్ట్ చేశామని, వారిలో 712 మంది విశాఖకు, 332 మంది ఆంధ్రకు, 400 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారని తెలిపారు. గంజాయి రవాణా అరికట్టేందుకు 8 చెక్ పోస్టులు,14,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.ఈగల్ ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ, “ఇప్పటివరకు 80 వేల కేజీల గంజాయి దగ్ధం చేశాం. ప్రజలు డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రతి తల్లి ఈగల్ టీం బ్రాండ్ అంబాసిడర్‌గా మారాలి. ఏ సమాచారం ఉన్నా 1972 నంబర్‌కు కాల్ చేయండి” అన్నారు.కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, యువత గంజాయి సేవించే అలవాటు మానుకోవాలని, ప్రజల సహకారంతోనే డ్రగ్స్‌ను పూర్తిగా అరికట్టగలమని తెలిపారు.
