పదో తరగతి పరీక్షలు సజావుగా జరుగుతున్నాయా అని తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్ S. Ramsundar Reddy పట్టణంలోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా స్థానిక BPM High Schoolను సందర్శించిన కలెక్టర్ పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థులకు కల్పించిన వసతులను పరిశీలించారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి Manikyam Naiduకు పలు సూచనలు చేశారు.పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
