విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధిలోని డోలపేట హైస్కూల్‌లో దారుణం వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే కామపిశాచిగా మారి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
డోలపేట హైస్కూల్‌లో సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్న ఆశీర్వాద్ అనే వ్యక్తి కొంతకాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. భయం భయంగా గడుపుతున్న విద్యార్థినులు, ఉపాధ్యాయుడి చేష్టల గురించి తమ తల్లిదండ్రులకు వివరించారు. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆశీర్వాద్‌ను నిలదీశారు.కిచక టీచర్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించి, కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు హెడ్ మాస్టర్‌కు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
