PM ఆవాస్ యోజన (PMAY) పథకంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను పీఎంఏవై ఆన్‌లైన్ పోర్టల్‌లో నిర్దేశిత గడువులోగా నమోదు చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టర్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి పైడిపల్లి, దేశాయిపేట, తిమ్మాపూర్, దూపకుంట ప్రాంతాల్లోని రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆన్‌లైన్ పోర్టల్‌లో అధికారులు సూచించిన పారామీటర్ల ప్రకారం లబ్ధిదారుల వివరాలను పూర్తి చేయాలి.
రెండు పడక గదుల ఇళ్ల వద్ద శుభ్రతతో పాటు నీటి సరఫరా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
