ఖిలా వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై విజిలెన్స్ దాడులు

April 16, 2026 4:27 PM

ఖిలా వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. డీఎస్పీ మల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో డాక్యుమెంట్లు, స్టాంప్ డ్యూటీకి సంబంధించిన అవకతవకలపై పరిశీలనలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఇంచార్జి సబ్‌ రిజిస్ట్రార్ వెంకట్ లాల్‌ను అధికారులు విచారిస్తున్నారు. తనిఖీల సమాచారం అందుకున్న కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు ముందస్తుగా తమ సెటర్లను మూసివేసి పరారైనట్లు సమాచారం.ఈ దాడులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అవకతవకలపై వెలుగులోకి తీసుకురానున్నాయని అధికారులు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media