విరాట్ కోహ్లీ చుట్టూ ఇన్ని కుట్రలా.. మోడల్ కు డబ్బులిస్తారట!!

May 13, 2026 8:37 AM

విరాట్ కోహ్లీకి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ లైక్ వివాదం మరో నాటకీయ మలుపు తిరిగింది. భారత స్టార్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడేందుకు, అతనిపై తప్పుడు ఆరోపణలు చేసేందుకు కొందరు జర్నలిస్టులు తనకు డబ్బు ఆఫర్ చేశారని జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్, గాయని అయిన లిజ్‌లాజ్ (LizLaz) పేర్కొన్నారు. కోహ్లీ అకౌంట్ నుండి ఆమె పోస్ట్‌లలో ఒకదానికి “లైక్” వచ్చినట్లు కనిపించడంతో ఊహించని విధంగా సోషల్ మీడియా వివాదంలో చిక్కుకున్నారు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్. కేవలం పబ్లిసిటీ లేదా డబ్బు కోసం కోహ్లీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు తాను నిరాకరించినట్లు తెలిపారు.

ఐపీఎల్ (IPL) 2026లో కోహ్లీ తన పేలవ ఫామ్‌పై విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో, ఈ తాజా పరిణామం కోహ్లీ మైదానం వెలుపలి సోషల్ మీడియా కార్యకలాపాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఫిల్మీమంత్రా మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో లిజ్ మాట్లాడుతూ, కోహ్లీ గురించి తప్పుడు ప్రకటనలు చేయాలని కోరుతూ కొందరు జర్నలిస్టులు తనను సంప్రదించారని ఆరోపించారు. కోహ్లీ అసలు చేయని పనుల గురించి ఆరోపణలు చేయడానికి కొందరు జర్నలిస్టులు తనకు డబ్బు కూడా ఆఫర్ చేశారని, కానీ ఆ పని తాను చేయలేకపోయానన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media