తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో రాత్రి, ఉదయం వేళల్లో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరుకున్నాయి.

తాజా సమాచారం ప్రకారం, పటాన్‌చెరులో అత్యల్పంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్‌లో 9 డిగ్రీలకు పడిపోయింది. రాజధాని హైదరాబాద్‌లో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నగరం చుట్టుపక్కల ప్రాంతాలైన దుండిగల్‌లో 13 డిగ్రీలు, హయత్‌నగర్‌లో 14 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 6 నుంచి 7 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది
