సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మించిన చిత్రం 'మా ఇంటి బంగారం' 

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం 'U/A' సర్టిఫికెట్‌ను పొందింది

ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాను 2026, జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది

బి.వి. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సమంత తన సొంత నిర్మాణ సంస్థ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరులతో కలిసి సంయుక్తంగా నిర్మించారు

ఈ చిత్రాన్ని మే 15నే విడుదల చేయాలని భావించినప్పటికీ, ఐపీఎల్ 2026 సీజన్ దృష్ట్యా జూన్ 19కి వాయిదా వేశారు

తమిళంలో 'ఎంగల్ తంగం' పేరుతో ఏకకాలంలో విడుదల కానుంది. ఇక జూన్ 18 నుంచే ఓవర్సీస్ ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.