మైదుకూరు మండలం గంజిగుంట ఫారెస్ట్ బీట్ పరిధిలో విద్యుత్ తీగలు ఒక మూగజీవి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పంట పొలాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ కనెక్షన్ తగిలి ఒక అడవి పంది మృతి చెందింది.
అడవి పంది మృతి చెందిన సమాచారం అందడంతో వనిపెంట ఫారెస్ట్ ఆఫీసర్ చలపతి నాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు.దుండగులు పందిని చంపి, దాని నాలుగు కాళ్లు మరియు లివర్ మాంసాన్ని తీసుకువెళ్లినట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన శరీర భాగాలను అక్కడే వదిలేసి వెళ్లారు. ఈ ఘటనపై పొలానికి సంబంధించిన రైతును అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.రైతులు తమ పొలాల చుట్టూ అక్రమంగా విద్యుత్ తీగలు (Electric Fencing) ఏర్పాటు చేయవద్దని ఫారెస్ట్ ఆఫీసర్ హెచ్చరించారు. ఇలాంటి చర్యల వల్ల వన్యప్రాణులు మృతి చెందితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.
