పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం ఉప్పలపాడు గ్రామంలో ఘోర కలి జరిగింది. గ్రామానికి చెందిన వేల్పుల మల్లీశ్వరి (44) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్యగా పోలీసులు భావిస్తున్నారు. మల్లీశ్వరి హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ హత్య వెనుక కుటుంబ గొడవలు ఉన్నాయా లేదా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
