నారీ శక్తి వందన కార్యక్రమంలో భాగంగా తగరపువలస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత, సమాన హక్కులు, స్వీయ రక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. శ్రీవాణి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని, నాయకత్వ లక్షణాలను అలవర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు.స్థానిక సచివాలయ సిబ్బంది జి. గురునాధ రావు, కళ్యాణరావు మహిళలకు తగిన ప్రోత్సాహం లభిస్తే అన్ని రంగాల్లో రాణించగలరని పేర్కొన్నారు.అధ్యాపకులు డాక్టర్ ఆర్. జయప్రకాష్ మహిళల అభివృద్ధి సమాజాభివృద్ధికి దోహదమని పేర్కొనగా, ఎం. నాగరాజు మహిళా సాధికారతలో ఎదురైన సవాళ్లను వివరించారు.కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
