మహిళా చైతన్యంతోనే సమాజ పటిష్టత

November 15, 2025 6:39 PM


మహిళల్లోని శక్తులను చైతన్య పరిస్తే సమాజం పటిష్టం అవుతుందని ఇక్ ఫాయ్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ విజయలక్ష్మి అభిప్రాయ పడ్డారు. అంతర్గత శక్తులను గుర్తించి, మెరుగు పరచుకొంటే విజయాలు సాధ్యం అవుతాయని సోదాహరణంగా వివరించారు. విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ లోని శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణ లో సప్త శక్తి సంగం కార్యక్రమం జరిగింది. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ కు చెందిన వివిధ కాలనీలకు చెందిన వందల మంది మహిళలు ఇందులో పాలు పంచుకొన్నారు. ప్రతీ మహిళలో ఉండే అంతర్గత శక్తులను చైతన్య పరిచే విధంగా దీనిని తీర్చిదిద్దారు. ప్రాక్టికల్ నమూనాలతో సహా నాయకత్వ లక్షణాలను ప్రోది చేస్తూ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. ఇందుకు సంబంధించిన సాహిత్యం తో కూడిన కిట్ ను ప్రతీ మహిళ కు అందచేశారు.

filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0; runfunc: 0; algolist: 0; multi-frame: 1; brp_mask:8; brp_del_th:0.0028,0.0000; brp_del_sen:0.1500,0.0000; motionR: null; delta:null; module: remosaic;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 7864320;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 269.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 40;

ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ విజయలక్ష్మి మహిళలను చైతన్య పరుస్తూ అనేక ఉదాహరణలు అందించారు. వక్తలుగా విచ్చేసిన నీరజ, మౌనిక స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు. ప్రస్తావన చేసిన వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి… సప్త శక్తి సంగం ఉద్దేశ్యాలను వివరించారు. పాఠశాలలోని మహిళా అధ్యాపకులు చొరవ తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని కార్యదర్శి విశ్వేశ్వరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ క్రిష్ణమోహన్ తదితరులు ప్రోత్సహించారు. సప్త శక్తి సంగం కార్యక్రమంతో ప్రాంగణం అంతా సందడిగా మారింది.

 


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media