విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేశినేని నానిని ఒక మునిగిపోతున్న నావ తో పోల్చటం జరిగింది. దీంతో పాటు ఒకానొక దశలో మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేశినేని నానికి పేకాట తప్ప మరో ఆట తెలియదు అని, అటువంటి వ్యక్తికి ఒలింపిక్ అసోసియేషన్ పదవి ఇచ్చారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు విజయవాడ రాజకీయాల్లో సంచలనం కలిగిస్తున్నాయి.
బందరులోని గొడుగుపేట వేంకటేశ్వర స్వామి చాలా మహిమ గల దేవుడని, గతంలో టీడీపీ హయాంలో ఆ స్వామి భూములు కొట్టేయాలని ప్రయత్నించిన ఓ పెద్దాయన అనారోగ్యం పాలయ్యారని నాని గుర్తుచేశారు. ఇప్పుడు ఎంపీ చిన్ని కూడా ఆ స్వామి ఆస్తులపై కన్నేయడం వల్లే ఆయనకు ఈ పరిస్థితి వచ్చిందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
