World:జైశంకర్ ‘సీక్రెట్ ఆపరేషన్’ ఎందుకో తెలుసా?

January 9, 2026 11:58 AM

భారత దౌత్య రంగంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి తన అంకితభావాన్ని చాటుకున్నారు. 2025 నవంబర్‌లో అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్, భీకరమైన మంచు తుపాను (Blizzard) కారణంగా విమానాలన్నీ రద్దు కావడంతో.. ఐక్యరాజ్యసమితి (UN) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గటెర్రస్‌తో నిర్ణీత సమావేశం కోసం ఆయన 670 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ వల్ల విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీనికి తోడు మైనస్ డిగ్రీల చలి, భారీ మంచు కురుస్తుండటంతో ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారింది. కెనడాలోని నయాగరా ఫాల్స్ నుంచి న్యూయార్క్ చేరుకోవడానికి అమెరికా సెక్యూరిటీ అధికారుల (DSS) సహాయంతో ఒక ప్రత్యేక కాన్వాయ్‌ను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఆగకుండా, మంచుతో కప్పబడిన హైవేలపై సుమారు 7 గంటల పాటు ప్రయాణించి జైశంకర్ న్యూయార్క్ చేరుకున్నారు. మధ్యలో భద్రతా తనిఖీలు, ప్రతికూల వాతావరణం ఎదురైనా వెనకడుగు వేయలేదు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలు (ఆపరేషన్ సిందూర్ వంటివి), బహుళపక్షవాదం (Multilateralism)పై చర్చించేందుకు ఈ సమావేశం అత్యంత కీలకం కావడంతో జైశంకర్ ఈ రిస్క్ తీసుకున్నారు. సకాలంలో ఐరాస ప్రధాన కార్యాలయానికి చేరుకున్న జైశంకర్, గటెర్రస్‌తో కీలక అంశాలపై చర్చలు జరిపారు. భారత దౌత్యం ఏ పరిస్థితిలోనైనా వెనక్కి తగ్గదని ఈ ఘటన నిరూపించింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media