యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

March 10, 2026 2:47 PM

Yadadri Bhuvanagiri districtలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. Bhuvanagiri మండలం వడపర్తి గ్రామ శివారు వద్ద ఆటోను రెండు డీసీఎం వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు.

ప్రమాదంలో బి.ఎన్. తిమ్మాపూర్‌కు చెందిన నరేష్, సురేష్, కేతమ్మలు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. వికలాంగుడైన నరేష్ ఘటనాస్థలంలోనే మృతి చెందగా, సురేష్ Bhuvanagiri జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేతమ్మను మెరుగైన చికిత్స కోసం Hyderabadకు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది.

సురేష్ ఆర్టీసీలో కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. బి.ఎన్. తిమ్మాపూర్ నుంచి భువనగిరికి పనుల నిమిత్తం వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. మృతదేహాలను శవ పరీక్ష కోసం భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media