వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ప్రసిద్ధ నందీశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం లోకకల్యాణార్థం మరియు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక హోమంలో జగన్ పాల్గొన్నారు.
హోమం అనంతరం నందీశ్వరుడికి అభిషేకం, అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు జగన్ మోహన్ రెడ్డికి వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు జగన్ రాకతో ఆలయ పరిసరాల్లో వైకాపా శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.రాజకీయ ఒడిదుడుకుల నేపథ్యంలో ఆధ్యాత్మిక శాంతి కోసం, పార్టీ బలోపేతం కోరుతూ జగన్ ఈ పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
