YSRCP నేతలపై దాడులు దారుణం మాజీ MLA రఘురామిరెడ్డి

February 2, 2026 6:35 PM

రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మైదుకూరులో వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీఐ రమణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

మాజీ మంత్రులు విడుదల రజిని, జోగి రమేష్, అంబటి రాంబాబులపై ఇటీవల జరిగిన దాడులను రఘురామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు చోటు లేదని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలకు భద్రత కరువైందని, శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు. దాడులకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.ఈ కార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media