వచ్చిందే 13k మెట్రిక్ Tonnes 24K గ్యాస్ ఇస్తాను అంటున్న cm

March 18, 2026 3:28 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్పీజీ సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ స్టాక్‌తో పాటు అదనంగా 24 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ విశాఖలో అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించారు. గ్యాస్ సరఫరా, సిలిండర్ల పంపిణీ, డెలివరీ సమయాన్ని 1.5 రోజులకు కుదించాలని అధికారులకు ఆదేశించారు.ఈకేవైసీ, ఓటీపీ విధానాల ద్వారా బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని, ఆసుపత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) నెట్వర్క్ విస్తరణపై కూడా సీఎం దృష్టి సారించారు. పట్టణ ప్రాంతాల్లో పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు పెంచేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.అదేవిధంగా త్వరలో ఏపీ వన్ యాప్ ద్వారా పలు ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media