పదేళ్ల బాలిక హత్య.. తమిళనాడులో రాజకీయ దుమారం

May 23, 2026 4:34 PM
girl death in tamilnadu

తమిళనాడులోని కోయంబత్తూర్‌లోని సూలూరు ప్రాంతంలో కిరాణా సామాన్లు తేవడానికి వెళ్లిన పదేళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైంది. ఆపై ఆ చిన్నారిని దుండగులు దారుణంగా హత్య చేశారు. చెరువులో ఓ మృతదేహం దొరికింది. ఈ ఘటనపై తమిళనాడు కొత్త సీఎం విజయ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘోర ఘటన దిగ్భ్రాంతిని, వేదనను కలిగించిందని, ఇలాంటి అమానవీయ నేరాలను సహించబోమన్నారు విజయ్. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. సమగ్రంగా విచారణ జరిపి తక్షణమే చార్జ్‌షీట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించామని ఆయన స్పష్టం చేశారు.

ఈ హత్య తర్వాత కొత్త ప్రభుత్వంపై ప్రతిపక్ష డీఎంకే తీవ్ర విమర్శలు చేసింది. సీఎం విజయ్ పదవి చేపట్టిన 12 రోజుల్లోనే నేరాలు పెరిగాయని ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. ఈ కేసులో కార్తీక్, మోహన్ రాజ్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణను వేగవంతం చేయడానికి తమిళనాడు డీజీపీ స్వయంగా కోయంబత్తూర్ వెళ్లారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media