దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ స్థాయిల హిందీ పరీక్షలకు రాపూరులోని సింహపురి ఇంగ్లీష్ మీడియం పాఠశాల వేదికైంది. పరిచయ, ప్రాథమిక, మాధ్యమిక మరియు రాష్ట్ర స్థాయి పరీక్షలను ఈ కేంద్రంలో విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా రాశారు.గతంలో హిందీ పరీక్షలు రాయాలంటే రాపూరు ప్రాంత విద్యార్థులు ఎంతో దూరం ప్రయాణించి ఇతర పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు స్థానికంగానే కేంద్రం ఏర్పాటు కావడంతో సుమారు 100 మంది విద్యార్థులు ఎటువంటి వ్యయప్రయాసలు లేకుండా పరీక్షలకు హాజరయ్యారు.
తమ బిడ్డలకు ఇంటి దగ్గర్లోనే పరీక్షా కేంద్రం రావడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయం కల్పించిన పాఠశాల యాజమాన్యానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.పరీక్షలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగాయని, విద్యార్థులు కూడా హిందీ భాషా నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో ఆనందం వ్యక్తం చేశారని పాఠశాల వర్గాలు తెలిపాయి.
