గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న విజయ్ దేవరకొండ – రష్మిక ఈ నెలలోనే (ఫిబ్రవరి 26, 2026) వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే, ఈ వేడుకను అత్యంత గోప్యంగా, కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జరపాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ కాకుండా ఉండేందుకు అతిథులపై ‘నో ఫోన్’ నిబంధన విధించినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ వేడుకకు చిత్ర పరిశ్రమకు చెందిన సహనటులను లేదా సహోద్యోగులను ఆహ్వానించలేదని, కేవలం అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ టీమ్‌తో కూడా ఇప్పటికే ‘నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్’ (NDA) కుదుర్చుకున్నట్లు సమాచారం.ఉదయ్‌పూర్ పెళ్లి ప్రైవేట్‌గా జరిగినప్పటికీ, మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
