జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా రాపూరు మండల పరిషత్ కార్యాలయంలో విద్యార్థులకు 400 మి.గ్రా అల్బెండాజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీఓ ఎం. భవాని ప్రారంభించారు.1 నుండి 19 ఏళ్ల వయస్సు గల పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించడం. మండలంలో మొత్తం 10,098 మంది చిన్నారులకు గాను, మొదటి విడతలో 9,903 మందికి మాత్రలు పంపిణీ చేశారు.ఈరోజు మాత్రలు తీసుకోని వారు లేదా గైర్హాజరైన పిల్లల కోసం ఫిబ్రవరి 24న ప్రత్యేకంగా మాత్రలు పంపిణీ చేయనున్నారు.విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, పిల్లల ఎదుగుదలకు నులిపురుగుల నివారణ ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ ప్రమీల రాజ్ కుమారి, సూర్య ధర్మేంద్ర, ఎంఈఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
