అన్నమయ్య జిల్లా గాలివీడులో రేషన్ డీలర్ కృష్ణారెడ్డి దారుణ హత్య

February 17, 2026 5:08 PM

రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడు మండలంలో తీవ్ర కలకలం రేగింది. ఒడిసిలెంకవారిపల్లెకు చెందిన రేషన్ షాప్ (స్టోర్) డీలర్ టి. కృష్ణారెడ్డి గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో అతికిరాతకంగా హత్యకు గురయ్యారు. దుండగులు కత్తులతో నరికి ఆయన్ని ప్రాణాలను తీసినట్లు సమాచారం.

ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ మరియు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పగలే జరిగిన ఈ ఘోరంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media