JEE మెయిన్స్ ఫలితాలలో బ్రహ్మంగారిమఠం మండలం, జి. నరసింహపురం గ్రామానికి చెందిన సానం భావన రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచారు. 97.37 పర్సంటైల్‌తో ఉత్తీర్ణత సాధించి తన గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచారు.
భావన రెడ్డి తండ్రి సానం శ్రీనివాసులు రెడ్డి ప్రస్తుతం పోరుమామిళ్ల డివిజన్ ఉద్యానవన శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. పదో తరగతి నుంచే చదువులో రాణిస్తున్న భావన రెడ్డి, ప్రస్తుతం బీరం విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలో ఇంతటి ఉత్తమ మార్కులు సాధించడంపై గ్రామస్తులు, మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఆ విద్యార్థినికి అభినందనలు తెలుపుతున్నారు.
