JEE Mainsలో బీరం శ్రీధర్ రెడ్డి కళాశాల ప్రభంజనం

February 17, 2026 5:38 PM

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కడప జిల్లా ఖాజీపేటలోని బీరం శ్రీధర్ రెడ్డి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. “జేఈఈ అంటే బీరం – బీరం అంటే జేఈఈ” అనే నినాదాన్ని నిజం చేస్తూ 17 మంది విద్యార్థులు అత్యుత్తమ పర్సంటైల్ సాధించారు.

టాప్ స్కోరర్లు: వై. వరుణ్ సందేశ్ (99.83), షేక్ మొహమ్మద్ ఫైజాన్ (99.61), ఎం. వెంకట కార్తీక్ (99.52), వై.పి. కృష్ణ చైతన్య (99.28) వంటి విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు.

ఈ సందర్భంగా విద్యాసంస్థల అధినేత బీరం సుబ్బారెడ్డి, చైర్‌పర్సన్ సరస్వతమ్మ మాట్లాడుతూ.. క్రమశిక్షణతో కూడిన శిక్షణ, ఉపాధ్యాయుల కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. అడ్వాన్స్‌డ్‌లోనూ మరిన్ని మెరుగైన ర్యాంకులు సాధించి ఐఐటి, ఎన్ఐటిలలో సీట్లు పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్, ప్రిన్సిపాల్స్ హేమ్ చందర్, శ్వేత విద్యార్థులను అభినందించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media