కొల్లూరులో 101 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

February 17, 2026 6:13 PM

సైబరాబాద్ పోలీస్ పరిధిలోని కొల్లూరులో భారీ గంజాయి రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. కొల్లూరు పోలీసులు మరియు మాదాపూర్ ఎస్‌ఓటీ (SOT) సంయుక్తంగా నిర్వహించిన మెరుపుదాడిలో 101.7 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు రూ. 25.72 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బస్వ జగన్నాథం, పల్లపు లక్ష్మీనారాయణలను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాకు చెందిన రాజు అనే వ్యక్తి నుంచి గంజాయి తెప్పించి, తెల్లాపూర్ సమీపంలోని కార్మికుల క్యాంపులే లక్ష్యంగా విక్రయించేందుకు నిల్వ చేసినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ప్రధాన నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. డ్రగ్స్ సమాచారం ఉంటే డయల్ 100 లేదా 9490617444కు తెలపాలని డీసీపీ శ్రీనివాస్ కోరారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media