AP:విద్యా రంగానికే మా ప్రాధాన్యం భీమిలి MLA గంటా శ్రీనివాసరావు

February 18, 2026 11:59 AM

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు బడ్జెట్‌లో అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా భీమిలి బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు ఆయన అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచాన్ని మార్చే శక్తి కేవలం విద్యార్థి, ఉపాధ్యాయుడు, పుస్తకం మరియు కలానికి మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని తల్లిదండ్రులకు, ఊరికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కాగా, విద్యార్థినులు స్వయంగా గీసిన తన చిత్రాలతో స్వాగతం పలకడంపై గంటా శ్రీనివాసరావు సంతోషం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి జగదీష్, ప్రిన్సిపాల్ పద్మావతి మరియు స్థానిక నేతలు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media