TG:జోగులాంబ గద్వాల జిల్లా NH 44 రోడ్డులో AP ఆర్టీసీ బస్సు బోల్తా

February 19, 2026 10:40 AM

జోగులాంబ గద్వాల జిల్లాలో తెల్లవారుజామున భారీ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి అనంతపురం వెళ్తున్న APSRTC బస్సు 44వ నంబర్ జాతీయ రహదారిపై ఇటిక్యాలపాడు స్టేజ్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అతివేగం లేదా డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media