జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల అంశంపై ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ఘాటుగా సమాధానమిచ్చారు.
“డిగ్రీ కాలేజీ భూముల్లో నేను ఒక్క గజం తప్పు చేసినట్లు నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా” అని రమణారెడ్డి స్పష్టం చేశారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు విధించినా ప్రజా క్షేత్రంలో నిజ నిర్ధారణ కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ధ్వజమెత్తారు. “కొందరు కావాలనే మొరుగుతున్నారు, రెచ్చగొట్టే వారి సంగతి తర్వాత చూస్తాం.. వొర్రినోళ్ళ వీపు సున్నం అయితది” అంటూ తనదైన శైలిలో హెచ్చరించారు. ఈ భూముల వ్యవహారంపై ఆర్టీఐ (RTI) కింద వివరాలు కోరానని, అధికారులు తటస్థంగా ఉండి నిజానిజాలు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
