TG:ఉట్నూరులో ప్రమాదం వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు

February 23, 2026 3:48 PM

అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం షాంపూర్ బ్రిడ్జి వద్ద సోమవారం ఘోర ప్రమాదం తప్పింది. అదిలాబాద్ నుండి ఆసిఫాబాద్ వెళ్తున్న ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (TS 20 T 9369) అదుపుతప్పి బ్రిడ్జి పైనుంచి వాగులో బోల్తా పడింది.

బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి ప్రయాణికులను బస్సులోంచి బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.బస్సు అదుపుతప్పి వాగులో పడినా, ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media