వివాదాస్పద చిత్రం “ది కేరళ స్టోరీ 2” విడుదలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కేరళ సమాజం అన్ని మతాల మధ్య పూర్తి సామరస్యంతో ఉందని, సినిమాలో చూపించిన అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.

కేరళలో హిందువులు, ముస్లింలు మరియు క్రైస్తవులు ఒకరి శుభకార్యాల్లో ఒకరు పాల్గొంటూ సోదరభావంతో మెలుగుతారని, సినిమా కేవలం ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని కోర్టు అభిప్రాయపడింది. కేరళను ఒక ప్రమాదకరమైన ప్రాంతంగా చూపించే ప్రయత్నాన్ని కోర్టు తప్పుపట్టింది. కేవలం సినిమా స్వేచ్ఛ పేరుతో వాస్తవాలను వక్రీకరించకూడదని హెచ్చరించింది.సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలపై సెన్సార్ బోర్డు (CBFC) వివరణ కోరిన కోర్టు, సమాజంలో విద్వేషాలను ప్రేరేపించే అంశాలను అనుమతించలేమని స్పష్టం చేసింది.
