National:ఓటర్ల నమోదులో ఆధార్ వినియోగం పై సుప్రీంకోర్టు

February 24, 2026 1:19 PM

ఎన్నికల ప్రక్రియలో ఆధార్ వినియోగాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్ల నమోదు లేదా గుర్తింపు కోసం ఆధార్‌ను ఉపయోగించడాన్ని నిరోధించాలనుకుంటే, ముందుగా ప్రజా ప్రాతినిధ్య చట్టం (RP Act)లో మార్పులు చేయాలని, దానికోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది.

ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఆధార్ అనుసంధానానికి వెసులుబాటు ఉన్నందున, అందులో మార్పులు కావాలంటే పార్లమెంటు ద్వారానే సాధ్యమని కోర్టు పేర్కొంది. ఆధార్ వాడటం వల్ల ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతుందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చట్టంలో మార్పులు చేసే అధికారం కేంద్రానిదేనని, ఈ విషయంలో ప్రభుత్వం వద్దే తమ విన్నపాన్ని తెలియజేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media