TG:మదీనాగుడలో దోమల స్ప్రే చేయించిన BJP నేత పవన్ కుమార్

February 24, 2026 5:24 PM

డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో పెరుగుతున్న దోమల బెడదను అరికట్టేందుకు బీజేపీ సీనియర్ నాయకుడు పవన్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. GHMC సర్కిల్-48 అధికారులతో సమన్వయం చేసుకుని కాలనీలో భారీ పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.

శాంతినగర్‌లోని సుమారు 400కు పైగా ఇళ్లలో లార్వా స్ప్రే నిర్వహించారు. పవన్ కుమార్ స్వయంగా బృందంతో కలిసి ప్రతి ఇంటి పరిసరాలను పర్యవేక్షించారు. సుమారు 2,000 మంది స్థానికులను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం లార్వా స్ప్రే, సాయంత్రం ఫాగింగ్ (పొగమందు) నిరంతరం జరిగేలా అధికారులను కోరారు.సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణమే స్పందించిన పవన్ కుమార్ తీరును స్థానికులు కొనియాడారు. మదీనాగుడ ప్రాంతాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తానని, తనకు సహకరించిన GHMC సిబ్బందికి ధన్యవాదాలని పవన్ కుమార్ తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media