ఆపరేషన్ అక్టోపస్’ సైబర్ స్కామ్ ఛేదించిన హైదరాబాద్ పోలీసులు

February 24, 2026 6:21 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేల కోట్ల రూపాయల అంతర్జాతీయ సైబర్ స్కామ్‌ను హైదరాబాద్ సిటీ పోలీసులు బట్టబయలు చేశారు. ‘ఆపరేషన్ అక్టోపస్’ పేరుతో చేపట్టిన ఈ భారీ ఆపరేషన్‌లో 10 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి, అంతర్జాతీయ ముఠా గుట్టురట్టు చేశారు.

సుమారు 1,500 మంది పోలీసులు, 50 బృందాలుగా విడిపోయి 10 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. సెబీ (SEBI) గుర్తింపు పొందిన సంస్థలుగా నమ్మించి నకిలీ ట్రేడింగ్ యాప్స్ ద్వారా పెట్టుబడులు పెట్టించడం, ఆపై ఆ సొమ్మును ‘ములే అకౌంట్స్’ (Mule Accounts) ద్వారా క్రిప్టో కరెన్సీగా మార్చి చైనా, దుబాయ్, హాంకాంగ్ వంటి దేశాలకు మళ్లించేవారు. ₹15 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా, ₹100 కోట్ల బ్యాంకు నిధులను ఫ్రీజ్ చేశారు. 500 సిమ్ కార్డులు, 50 ల్యాప్‌టాప్‌లను సీజ్ చేశారు.ఇద్దరు విదేశీయులతో సహా మొత్తం 25 మంది కీలక నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media