TG:వైరాలో భారీగా డ్రగ్స్ పట్టివేత 101 కిలోల గంజాయి

February 25, 2026 10:29 AM

ఖమ్మం జిల్లా వైరాలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు భారీ స్థాయిలో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుండి హైదరాబాద్‌కు కారులో అక్రమంగా రవాణా చేస్తున్న 101.2 కిలోల ఎండు గంజాయి, 2.7 కిలోల హ్యాషిష్ ఆయిల్‌ను మంగళవారం పట్టుకున్నారు.

వైరా సమీపంలో అనుమాస్పదంగా వెళ్తున్న హర్యానా నెంబర్ ప్లేట్ కలిగిన కారును ఎక్సైజ్ బృందం ఆపి తనిఖీ చేయగా, భారీగా మత్తు పదార్థాలు బయటపడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన నిందితుడు మహమ్మద్ అస్లాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు 67.20 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గంజాయితో పాటు రవాణాకు వాడిన కారు, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని వైరా ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media