AP:త్వరలో నంది నాటకోత్సవాలు మంత్రి కందుల దుర్గేష్

February 28, 2026 12:51 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను చాటిచెప్పే నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను త్వరలోనే నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ఎఫ్.డి.సి (FDC) అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

నిలిచిపోయిన నంది అవార్డులు, టీవీ అవార్డులు, కందుకూరి పురస్కారాలను నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి జ్యూరీ, వేదికలు, తేదీలను ఖరారు చేస్తామన్నారు. ఏపీలో షూటింగ్‌లను ప్రోత్సహించేందుకు కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో షూటింగ్ జరుపుకునే చిత్రాల్లో ఆయా పర్యాటక ప్రాంతాల పేర్లను ప్రదర్శించేలా చర్యలు తీసుకోనున్నారు. రాజమహేంద్రవరంలో ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ (NSD) ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని మంత్రి తెలిపారు. యానిమేషన్, ఓటీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతికతలతో ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని, ఇందుకోసం త్వరలోనే భారీ వర్క్‌షాప్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. స్థానిక కళాకారులకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక ‘డేటా బ్యాంక్’ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలో స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్ల ఏర్పాటుకు వచ్చే వారికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media