కోనసీమ GMC బాలయోగి వర్ధంతి MLA బండారు సత్యానందరావు

March 3, 2026 6:09 PM

భారత లోక్‌సభ మాజీ స్పీకర్, కోనసీమ ముద్దుబిడ్డ గంటి మోహన చంద్ర బాలయోగి సేవలు అజరామరమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. మంగళవారం బాలయోగి వర్ధంతిని పురస్కరించుకుని కొత్తపేట బస్టాండ్ సెంటర్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే ఘన నివాళులర్పించారు.

కోనసీమ అభివృద్ధిలో బాలయోగి ముద్ర అడుగడుగునా కనిపిస్తుందని, సిద్ధాంతం, జొన్నాడ, యానాం-ఎదుర్లంక వారధుల నిర్మాణంలో ఆయన కృషి మరువలేనిదని ఎమ్మెల్యే గుర్తుచేశారు.ఒక దశాబ్ద కాలం పాటు ప్రజాప్రతినిధిగా సేవలందించి, లోక్‌సభ స్పీకర్‌గా దేశస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు.బాలయోగిపై ఉన్న అభిమానంతోనే ప్రజలు ఆయన కుమారుడు హరీష్ మాధుర్‌ను పార్లమెంటు సభ్యునిగా గెలిపించుకున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాలయోగికి నివాళులు అర్పించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media