ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధ వార్తలపై అనవసర ఉద్వేగాలు, ఊహాజనిత కథనాలు ప్రసారం చేస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Ministry of Information and Broadcasting ఆదేశాల మేరకు న్యూస్ ఛానళ్ల టీఆర్పీ రేటింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేయాలని Broadcast Audience Research Councilకు సూచించింది.

ఈ నిర్ణయం నాలుగు వారాల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమల్లో ఉంటుందని కేంద్రం తెలిపింది. యుద్ధ వార్తలను సంచలనంగా ప్రసారం చేయడం వల్ల ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయని మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

