NTR జిల్లాలో Govt స్కూల్‌లో నాసిరకం భోజనం.. పారేసిన విద్యార్థులు

March 11, 2026 3:29 PM

NTR Districtలోని Mylavaram మండలం దేవుని చెరువు ఎంపీపీ పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై వివాదం తలెత్తింది.

గత మూడు నెలలుగా నాసిరకం ఆహారం అందిస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపించారు. భోజనం తినలేక విద్యార్థులు ఆహారాన్ని డస్ట్‌బిన్‌లో పారబోసిన ఘటన వెలుగులోకి వచ్చింది.విద్యార్థుల తల్లిదండ్రులు 112కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్కూల్‌కు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. భోజనం తినలేకపోతున్నామని విద్యార్థులు పోలీసులకు తెలిపారు. అయితే సమస్యపై అధికారులు స్పందించకపోవడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media